Shikhar Dhawan: శిఖర్ ధావన్ కొత్త గర్ల్ ఫ్రెండ్..? 1 y ago
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ పర్సనల్ లైఫ్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మాజీ క్రికెటర్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో.. ప్రేక్షకుల గ్యాలరీతో కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ధావన్ కనిపించాడు. తన పక్క చైర్లో కూర్చున్న ఆమె ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నది. అయితే ఆమె వివరాలు ఏంటని నెట్ యూజర్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా మహిళకు విడాకులు ఇచ్చిన ధావన్ మళ్లీ పర్సనల్ లైఫ్ లో బిజీ అయినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.